Cop Dies After Pushed | పటాకులు కాల్చడంపై వాగ్వాదం.. పోలీస్ అధికారిని తోసేయడంతో మృతి
Cop Dies After Pushed | కొందరు వ్యక్తులు రోడ్డుపై పటాకులు కాల్చడంపై పోలీస్ అధికారి అభ్యంతరం వ్యక్తం చేశారు. వాగ్వాదం సందర్భంగా ఆ వ్యక్తులు పోలీస్ అధికారిపై దాడి చేసి తోశారు. కుప్పకూలిన ఆయన మరణించారు. దీంతో ఆ వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
చెన్నై: కొందరు వ్యక్తులు రోడ్డుపై పటాకులు కాల్చడంపై పోలీస్ అధికారి అభ్యంతరం వ్యక్తం చేశారు. వాగ్వాదం సందర్భంగా ఆ వ్యక్తులు పోలీస్ అధికారిపై దాడి చేసి తోశారు. కుప్పకూలిన ఆయన మరణించారు. దీంతో ఆ వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. (Cop Dies After Pushed) తమిళనాడులోని తేని జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తేని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) కార్యాలయంలో స్పెషల్ సబ్-ఇన్స్పెక్టర్గా సెంథిల్ కుమార్ పనిచేస్తున్నారు. శనివారం రాత్రి విధుల తర్వాత సాదా దుస్తుల్లో ఉన్న ఆయన ఇంటికి తిరిగి వెళ్తున్నారు.
కాగా, రోడ్డు మధ్యలో కొందరు వ్యక్తులు బాణసంచా కాలుస్తుండటాన్ని సివిల్ డ్రెస్‌లో ఉన్న పోలీస్ అధికారి సెంథిల్ కుమార్ గమనించారు. రోడ్డుపై టపాకులు కాల్చి ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆ యువకులు, ఆయన మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి సెంథిల్ కుమార్‌ను నెట్టడంతో పాటు మోచేతితో బలంగా కొట్టాడు. దీంతో ఆయన కుప్పకూలిపోయారు.
వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆ పోలీస్ అధికారి మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరణించిన పోలీస్ అధికారి సెంథిల్ కుమార్‌కు గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలు ఉన్నాయని పోలీస్ అధికారి తెలిపారు.
మరోవైపు తమిళనాడులో ప్రతిపక్ష నాయకుడైన ఉదయనిధి స్టాలిన్ ఈ సంఘటనను ఖండించారు. పండుగ రోజున రాష్ట్రవ్యాప్తంగా పలు హత్యలు జరిగాయని ఆయన ఆరోపించారు. ‘అసమర్థమైన ఈ ప్రభుత్వ హయాంలో పోలీస్ సిబ్బందితో సహా తొమ్మిది మంది ఒక్క రోజులోనే హత్యకు గురయ్యారు. పండుగ రోజున బాణసంచా శబ్దాల కంటే కత్తులతో దాడులు చేసే శబ్దాలే ఎక్కువగా వినిపిస్తున్నా ఈ సిగ్గులేని ప్రభుత్వాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా’ అని ఎక్స్‌లో విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cop Dies After Pushed | పటాకులు కాల్చడంపై వాగ్వాదం.. పోలీస్ అధికారిని తోసేయడంతో మృతి
‘యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి’
Agriculture university | వీసీ అల్డాస్ జానయ్యపై నో యాక్షన్.. ప్రభుత్వం దేని కోసం ఉన్నదంటూ నిరసనలు.. వీడియో
Man Kills Nephew To Sell Organs | అవయవాలు అమ్మి డబ్బు సంపాదించేందుకు.. బాలుడిని చంపిన బంధువు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

