చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న చెకుముకి సైన్స్ సంబురాలు-2026కు సంభందిgచిన పోస్టర్ను కరకగూడెం మండల విద్యాశాఖ అధికారి గడ్డం మంజూల మండల కేంద్రంలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా...
కరకగూడెం, నవంబర్ 09 : జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న చెకుముకి సైన్స్ సంబురాలు-2026కు సంభందిgచిన పోస్టర్ను కరకగూడెం మండల విద్యాశాఖ అధికారి గడ్డం మంజూల మండల కేంద్రంలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, ప్రశ్నించే తత్వం, పరిశీలనా శక్తిని పెంపొందించేందుకు చెకుముకి సైన్స్ సంబరాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. విద్యార్థులు మూఢ నమ్మకాలకు దూరంగా ఉంటూ ప్రతీ విషయాన్ని శాస్త్రీయంగా ఆలోచించాలని సూచించారు. అనంతరం జన విజ్ఞాన వేదిక నాయకుడు లింగంపల్లి దయానంద్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో విజ్ఞానశాస్త్రంపై ఆసక్తిని పెంపొదించడం, వారిలోని సృజనాత్మకతను వెలికితీయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. ఈ చెకుముకి సంబరాలు ఈ నెల 12న పాఠశాల స్థాయి, 13న మండల స్థాయి, 28న జిల్లా స్థాయి డిసెంబర్ 11, 12, 13 తేదీల్లో హైదరాబాద్లోని సీఎంఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్స్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెకుముకి కన్వీనర్ లక్ష్మణరాజు, ఉపాధ్యాయులు గౌసియా, ప్రవళిక, రంజిత్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
Narnoor | గోవర్ధన్ గుట్టపై ఆదివాసుల సాంప్రదాయ పూజలు
Women Professor | వీసీ అల్డాస్ జానయ్య వేధింపులకు మరో మహిళా ప్రొఫెసర్ కంటతడి.. వీడియో
Cop Dies After Pushed | పటాకులు కాల్చడంపై వాగ్వాదం.. పోలీస్ అధికారిని తోసేయడంతో మృతి
‘యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

