Narendra Modi | దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం అట్టహాసంగా సాగింది. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానిగా మోదీగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి 8 వేల మంది అతిథులను ఆహ్వానించారు.
మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి సార్క్ సభ్య దేశాల ప్రతినిధులు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాల అధినేతలతో పాటు దేశ నలుమూలల నుంచి పలువురు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు తరలివచ్చారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా , శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషన్, సీషెల్స్ దేశాధినేతలు హాజరయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ నితీశ్ కుమార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, నటులు షారుక్ ఖాన్, రజినీకాంత్, ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామితో పాటు పలువురు ప్రముఖులు ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు.
#WATCH | Narendra Modi takes oath for the third straight term as the Prime Minister pic.twitter.com/Aubqsn03vF
— ANI (@ANI) June 9, 2024
కేంద్ర మంత్రివర్గ ప్రమాణస్వీకార నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో పాటు.. ఢిల్లీని నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. రాత్రి 11 గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి.
మోదీతో పాటు కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన నేతలు వీళ్లే..
రాజ్‌నాథ్ సింగ్,
అమిత్ షా,
నితిన్ గడ్కరీ,
జేపీ నడ్డా,
శివరాజ్ సింగ్ చౌహాన్,
నిర్మలా సీతారామన్,
జైశంకర్,
మనోహర్‌లాల్ ఖట్టర్,
కుమారస్వామి ( జేడీఎస్),
పీయూష్ గోయల్,
ధర్మేంద్ర ప్రదాన్,
జితన్‌రాం మాంఝీ (హిందుస్థానా అవామ్ మోర్చా),
లలన్ సింగ్ (జేడీయూ),
సర్బానంద సోనోవాల్,
వీరేంద్రకుమార్,
కింజారపు రామ్మోహన్ నాయుడు (టీడీపీ),
ప్రహ్లాద్ జోషి,
జుయల్ ఓరం,
గిరిరాజ్ సింగ్,
అశ్వనీ వైష్ణవ్,
జ్యోతిరాదిత్య సింథియా,
భూపేంద్ర యాదవ్
గజేంద్ర సింగ్ షెకావత్,
అన్నపూర్ణాదేవి (జార్ఖండ్),
కిరణ్ రిజిజు,
హర్దీప్ సింగ్,
మన్సుఖ్ మాండవీయ,
కిషన్ రెడ్డి,
చిరాగ్ పాసవాన్ (ఎల్జేపీ ),
సీఆర్ పాటిల్,
రావ్ ఇంద్రజీత్‌సింగ్,
జితేంద్ర సింగ్,
అర్జున్ మేఘవాల్,
ప్రతాప్ రావ్ గణపత్ రావు జాదవ్,
జయంత్ చౌదరి,
జితిన్ ప్రసాద్,
శ్రీపాద్ యశో నాయక్,
పంకజ్ చౌదరి,
క్రిషన్ పాల్,
రాందాస్ అఠవలే,
రామ్‌నాథ్ ఠాకూర్,
నిత్యానంద్ రాయ్,
అనుప్రియ పటేల్,
సోమన్న,
పెమ్మసాని చంద్రశేఖర్,
ఎస్పీ సింగ్ బఘేల్,
శోభా కరంద్లాజే,
కీర్తివర్ధన్ సింగ్,
బీఎల్ వర్మ,
శాంతను ఠాకూర్,
సురేశ్ గోపి,
ఎల్ మురుగన్,
అజయ్ తంప్టా,
బండి సంజయ్,
కమలేశ్ పాసవాన్,
భగీరథ్ చౌదరి,
సతీశ్ చంద్ర దూబె,
సంజయ్ సేథ్,
రవనీత్ సింగ్,
దుర్గాదాస్ ఉయికె,
రక్షా నిఖిల్ ఖడ్సే,
సుఖాంత్ మజుందర్,
సావిత్రి ఠాకూర్,
తోకన్ సాహు,
రాజ్ భూషణ్ చౌదరి,
భూపతి రాజు శ్రీనివాస వర్మ,
హర్ష మల్హోత్రా,
నిముబెన్ బంభానియా,
మురళీధర్ మొహోల్,
జార్జ్ కురియన్,
పవిత్ర మార్గెరెటా,