ముంబై : న్యూట్రాస్యూటికల్స్ విభాగంలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్‌లకు నైపుణ్యాలను అందించేందుకు న్యూట్రిఫీ టుడే అకాడమీ ప్రారంభించినట్లు న్యూట్రిఫీ టుడే వెల్లడించింది. ప్రపంచంలో మొట్టమొదటి న్యూట్రాస్యూటికల్స్ అకాడమీ కావడం గమనార్హం. పరిశ్రమ వృద్ధితో పాటు న్యూట్రాస్యూటికల్స్ విభాగంలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్‌లకు అవసరమైన నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా ఇది సేవలందించనున్నది. న్యూట్రిఫీ టుడే అకాడమీ కార్యక్రమాలు ముంబై, బెంగళూరులలో నిర్వహిస్తుంది.
మొదటి భారత్ ,ఆసియా దేశాలపై దృష్టి సారించి, అనంతరం ఇతర దేశాలకు ఆన్లైన్ కరిక్యులమ్ ద్వారా తమ సేవలను విస్తరించనుంది. గీతం,సెంచురియన్ యూనివర్శిటీ, ఏఐసీ-సీసీఎంబీ, నేషనల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసన్ వంటి పలు యూనివర్శిటీలు న్యూట్రిఫీ టుడే అకాడమీతో ఒప్పందాలు కలిగి ఉన్నాయి.
న్యూట్రిఫీ టుడే చీఫ్ క్యాటలిస్ట్ అమిత్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ‘‘ ఫార్మా, ఫుడ్ టెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, కెమికల్ ఇంజినీరింగ్ వంటివి అభ్యసిస్తున్నయూనివర్శిటీ విద్యార్థులకు తగిన అవకాశాలను న్యూట్రిఫీ టుడే అకాడమీ అందిస్తుంది. 2024 నాటికి 5వేల మంది ప్రొఫెషనల్స్‌కు శిక్షణ అందించగలమని ’’ అని అన్నారు.