న్యూఢిల్లీ: నీట్ యూజీ పరీక్ష మళ్లీ రాయబోతున్న విద్యార్థుల కోసం.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాట్సాప్ ద్వారా అలర్ట్ మెసేజ్‌లను జారీ చేసింది. నీట్ రీఎగ్జామ్ రాయనున్న విద్యార్థులకు వెరిఫైడ్ వాట్సాప్ అకౌంట్ నుంచి మాత్రమే ఆ సందేశాలు వెళ్తున్నాయి. జూన్ 21వ తేదీన నీట్ యూజీ రీఎగ్జామ్‌ను నిర్వహించనున్న విషయం తెలిసిందే. విద్యార్థులకు కచ్చితమైన, నమ్మకమైన సమాచారాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో వాట్సాప్ ద్వారా ఎగ్జామ్ సెంటర్లు, అడ్మిట్ కార్డులను జారీ చేస్తున్నారు. ఫేక్ మెసేజ్‌లు, ఆన్లైన్ స్కామ్‌ల నుంచి విద్యార్థులను రక్షించే ఉద్దేశంతో ఈ చర్యకు దిగారు.
ఎన్టీఏ సంస్థ +91 78279 80287 నెంబర్‌ను వాట్సాప్ వెరిఫైడ్ అకౌంట్‌గా ప్రకటించింది. ఆ నెంబర్ నుంచి వచ్చే మెసేజ్‌లను మాత్రమే విద్యార్థులు నమ్మాలని ఎన్టీఏ తన ప్రకటనలో తెలిపింది. ఆ నెంబర్‌కు బ్లూ వెరిఫికేషన్ టిక్ ఉంటుందని, దానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని పేరు కూడా ఉంటుందని ఎన్టీఏ పేర్కొన్నది. ఎన్టీఏ నుంచి మెసేజ్ పంపిస్తున్నామని చెప్పి, దానికి వెరిఫైడ్ బ్యాడ్జ్ లేకుంటే, అది అనుమానిత మెసేజ్‌గా భావించాలని ఎన్టీఏ తన ప్రకటనలో చెప్పింది. వాట్సాప్ సర్వీస్ అనేది వన్ వే కమ్యూనికేషన్ ఛానల్ అని, అభ్యర్థులను ఓటీపీ షేర్ చేయాలని కోరబోమని ఎన్టీఏ పేర్కొన్నది. క్వశ్చన్ పేపర్లు కానీ, ఆన్సర్ పేపర్లను కానీ , ఎటువంటి లీకేజీ అంశాన్ని ఆ నెంబర్లో ఉండబోవని ఎన్టీఏ తెలిపింది.
అధికారిక నీట్ వెబ్ సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలని ఎన్టీఏ సూచించింది. మే 3వ తేదీన జరిగిన పరీక్షకు చెందిన అడ్మిట్ కార్టులు జూన్ 21వ తేదీ నాటి పరీక్షకు పనికిరావు అని అధికారులు తెలిపారు.
It is clarified that those who have already downloaded their Admit Cards for the 21st June NEET UG Examination need not do it again. The SMS/Email/WhatsApp messages are primarily for those students who are yet to download their new Admit Cards. The 3rd May Admit Cards won’t be…
— National Testing Agency (@NTA_Exams) June 19, 2026