NTA | ‘నీట్’ పేపర్ లీకవ్వలే.. కొన్ని ప్రశ్నలే బయటకొచ్చాయి..!
NTA : 'నీట్' యూజీ ప్రశ్నప్రత్రం లీకేజీపై విమర్శలు వస్తున్న వేళ ఎన్టీఏ (NTA) అధికారులు తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. నీట్ పేపర్ లీకవ్వలేదని, కొన్ని ప్రశ్నలు మాత్రమే బయటకు వచ్చాయని పార్లమెంటరీ స్థాయి కమిటీకి స్పష్టం చేశారు.
NTA : ‘నీట్’ యూజీ ప్రశ్నప్రత్రం లీకేజీపై విమర్శలు వస్తున్న వేళ ఎన్టీఏ (NTA) అధికారులు తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. నీట్ పేపర్ లీకవ్వలేదని, కొన్ని ప్రశ్నలు మాత్రమే బయటకు వచ్చాయని పార్లమెంటరీ స్థాయి కమిటీకి స్పష్టం చేశారు. అందరూ అనుకుంటున్నట్టుగా మే 3వ తేదీన జరిగిన నీట్ యూజీ పరీక్ష పేపర్ పూర్తిగా లీకవ్వలేదని, కొన్ని ప్రశ్నలు మాత్రమే లీకయ్యాయని ఎన్టీఏ చీఫ్ అభిషేక్ సింగ్(Abhishek Singh) పార్టీమెంటరీ కమిటీకి తెలిపారు.
వైద్య విద్యలో ప్రవేశాల కోసం మే 3న నిర్వహించిన నీట్ పరీక్ష లీకేజీ దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. లీకేజీ వ్యవహారంలో పరీక్షకు హాజరైన 22 లక్షల మంది విద్యార్థులు కంగుతిన్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పార్లమెంటరీ స్థాయి కమిటీ ఎన్టీఏ అధికారులను ప్రశ్నించగా వారు పేపర్ పూర్తిగా లీకవ్వలేదని, కొన్ని ప్రశ్నలే బయటకు వచ్చాయని వివరించారు.
NEET पेपर लीक पर संसद की स्थायी समिति की बैठक। संसदीय कमेटी के सामने पेश हुए NTA अध्यक्ष का पेपर लीक से इनकार -सूत्र
Visit https://t.co/iu10vmpTKi#NEETPaperLeek #NTAChief #CBI #NTA #NewsUpdate #NewsNation | @anuragdixit2005 @VikaasChandraa pic.twitter.com/b0yRphNmV5
— News Nation (@NewsNationTV) May 21, 2026
‘నీట్ పరీక్షలో కొన్ని అవకతవకలు జరిగాయి. అంతేతప్ప పూర్తిగా ప్రశ్నపత్రం లీకవ్వలేదు. నీట్ పరీక్షను లీకేజీకి ఆస్కారమివ్వకుండా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నాం. పేపర్ బయటకు రావడాన్ని ఏమాత్రం సహించని కారణంగానే పరీక్షను రద్దు చేశాం’ అని ఎన్టీఏ అధ్యక్షుడు అభిషేక్ సింగ్, ఉన్నత విద్యా శాఖ సెక్రటరీ వినీత్ జోషి పార్లమెంటరీ కమిటీకి వెల్లడించారు. నీట్ పరీక్షను తిరిగి జూన్ 21న నిర్వహిస్తున్నట్టు ఎన్టీఏ ఇదివరకే ప్రకటించింది.

సూత్రధారి సహా పలువురి అరెస్ట్
నీట్ లీకేజీపై విచారణ చేపట్టిన కేంద్ర దర్యాప్తు సంస్థ సూత్రధారులు సహ పలువురిని అరెస్ట్ చేసింది. లీకేజీతో సంబంధమున్న ప్రొఫెసర్ మనీషా గురునాథ్ మంధరే, శివరాజ్ మొటెగావ్క్కర్, రసాయనశాస్త్ర ప్రొఫెసర్ పీవీ కులకర్ణి, మనోజ్ శిరురే(పిడియాట్రిషియన్)తో పాటు.. మనీషా వాగ్మరేను సైతం సీబీఐ అదుపులోకి తీసుకుంది. అలానే.. ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాశిక్‌లో పలువురిని అరెస్ట్ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

