Conrad Sangma | మేఘాలయ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగ్మా
Conrad Sangma | మేఘాలయ రాష్ట్రంలో MDA (మేఘాలయ డెమొక్రటిక్ అలయన్స్) ప్రభుత్వం కొలువు దీరింది. ముఖ్యమంత్రిగా నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) చీఫ్ కాన్రాడ్ సంగ్మా ప్రమాణస్వీకారం చేశారు.
షిల్లాంగ్: మేఘాలయ రాష్ట్రంలో MDA (మేఘాలయ డెమొక్రటిక్ అలయన్స్) ప్రభుత్వం కొలువు దీరింది. ముఖ్యమంత్రిగా నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) చీఫ్ కాన్రాడ్ సంగ్మా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన మేఘాలయ సీఎంగా ప్రమాణం చేయడం ఇది వరుసగా రెండోసారి. మేఘాలయ గవర్నర్ ఫగూ చౌహాన్ సంగ్మా చేత ప్రమాణస్వీకారం చేయించారు.
సంగ్మాతోపాటుగా ప్రిస్టోన్ టైన్సాంగ్, స్నియావ్‌భలాంగ్ ధార్ మేఘాలయ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక ఎమ్మెల్యేలు అబు తాహెర్ మోండల్, కైర్మెన్ షిల్లా, మార్కుయిస్ ఎన్ మరాక్, రక్కమ్ ఎ సంగ్మా, అలెగ్జాండర్ లలూ హెక్, అంపరీన్ లింగ్డో, పాల్ లింగ్డో, కొమింగోన్ యంబాన్, షక్లియర్ వార్జ్రీల చేత గవర్నర్ మంత్రులుగా ప్రమాణం చేయించారు.
మొత్తం 60 స్థానాలున్న మేఘాలయలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని NPP 26 స్థానాల్లో విజయం సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ఆ తర్వాత 11 స్థానాలతో యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (UDF) రెండో స్థానంలో ఉంది. ఈ క్రమంలో సంగ్మా UDF, HSPDP, BJP, ఇండిపెండెంట్లతో కలిసి కూటమిని ఏర్పాటు చేశారు. మొత్తం 45 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ram Charan | రామ్ చరణ్ – అనిరుధ్ కాంబినేషన్ ఫిక్స్.. క్రేజీ కాంబోపై భారీ అంచనాలు!
Shreyas Iyer | శ్రేయస్ అయ్యర్ ఔట్‌తో కన్నీళ్లు పెట్టుకున్న మహిళా అభిమాని .. వైరల్‌గా మారిన వీడియో
Zayn Marie | ఆమిర్ ఖాన్ మేనకోడలికి గాయాలు.. పోలీసుల చర్యలపై జైన్ మేరీ ఆగ్రహం
Bala Krishna | ట్రాఫిక్ సమస్యకు బాలకృష్ణ సహకారం.. ఎన్టీఆర్ జ్ఞాపకాలతో ముడిపడిన ఇంటి స్థలాన్ని వదులుకోనున్నారా..!
Jailer 2 | ‘జైలర్ 2’లో యంగ్ రజనీకాంత్ స్పెషల్ ఫ్లాష్‌బ్యాక్.. శివరాజ్‌కుమార్‌తో కలిసి జైలు సీక్వెన్స్ ఉంటుందా?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

