న్యూఢిల్లీ : ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) ప్రవేశపెట్టిన కొత్త ఈ-జీరో ఎఫ్ఐఆర్ విధానం వల్ల సైబర్ క్రిమినల్స్‌ను మునుపెన్నడూ లేనంత వేగంగా పట్టుకోవచ్చునని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం చెప్పారు. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ఢిల్లీలో ప్రారంభించినట్లు తెలిపారు.
ప్రారంభంలో రూ.10 లక్షల కన్నా ఎక్కువ సైబర్ ఆర్థిక నేరం జరిగినపుడు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లేదా హెల్ప్‌లైన్ నంబరు 1930 ద్వారా దాఖలు చేసిన ఫిర్యాదు ఆటోమేటిక్‌గానే ఎఫ్ఐఆర్గా మారుతుందని చెప్పారు. ప్రాదేశిక అధికార పరిధితో సంబంధం లేకుండా, ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్ల జారీ ప్రక్రియను త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరిస్తామని తెలిపారు.