న్యూఢిల్లీ: కల్తీ దగ్గు మందుతో చిన్నారులు మృత్యువాతపడిన వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది. ఈ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలను సోమవారం ఆదేశించింది. కల్తీ దగ్గు మందు విక్రయాలని తక్షణమే నిలిపివేయాలని కోరింది. రెండు వారాల్లోగా సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించింది. కల్తీ మందు సరఫరాపై దర్యాప్తునకు ఆదేశించాలని కేంద్ర ఆరోగ్య శాఖ, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ), సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీసీఎస్వో), డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్(డీజీహెచ్ఎస్)ను కోరింది.