Shashi Tharoor : ఒక మలయాళీగా కేంద్ర బడ్జెట్ (Union Budget) తనను సంతృప్తిపర్చలేదని కాంగ్రెస్ ఎంపీ (Congress MP) శశిథరూర్ (Shashi Tharoor) అన్నారు. ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) తన బడ్జెట్ ప్రసంగంలో కేరళ (Kerala) పేరునే ప్రస్తావించకపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పారు. ఆయుర్వేదం విషయంలోగానీ, మత్స్యకారులు విషయంలో గానీ, కొబ్బరి తోటల విషయంలోగానీ కేరళ పేరు ప్రస్తావనకు రాకపోవడం శోచనీయమని అన్నారు.
‘కేరళకు ఆయుర్వేదంతో సుదీర్ఘ సంబంధం ఉంది. అందుకే ‘ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదను కేరళ పెడుతామనే ప్రకటన వస్తుందని ఎదురుచూశాం. కానీ ఆ ప్రస్తావన ఎక్కడుంది..? ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేస్తాం అన్నారు. కానీ ఎక్కడ అనేది చెప్పలేదు. కనీసం కేరళ పేరును కూడా బడ్జెట్లో ప్రస్తావించలేదు. ఆఖరికి మత్స్యకారులు, కొబ్బరి తోటల విషయంలో కూడా కేరళ పేరు ప్రస్తావన రాలేదు’ అని శశిథరూర్ అన్నారు.
గత కొన్నేళ్లుగా చేస్తున్న బడ్జెట్ ప్రసంగాలలో ఇది చాలా చిన్నదని థరూర్ చెప్పారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారి కోసం ప్రభుత్వం ఎటువంటి ప్రోత్సాహక చర్యలు తీసుకోలేదని పెదవి విరిచారు. భవిష్యత్తులో కేంద్రం ఏం చేయబోతోందనే విషయంలో ఎలాంటి వివరాలు లేవన్నారు. ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కోసం 15 ఏళ్లుగా ఎదురుచూస్తున్నామని, దానిపై ఎటువంటి ప్రకటన రాలేదని అన్నారు.