న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ నోట్ల రద్దు నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాని బాధ్యతారాహిత్య నిర్ణయం తీసుకొన్నారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గతంలో పేర్కొన్నారు. దాని తర్వాత అనేక అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని అన్నారు. 99.9 శాతం రద్దు అయిన నోట్లు వెనక్కు వచ్చినట్టు ప్రకటించారని, అంటే దీని అర్థం నల్లధనం వైట్‌గా, దొంగ నోట్లు చట్టబద్ధమైన సొమ్ముగా మారిందనే కదా! అని పేర్కొన్నారు.
లేకుంటే నల్లధనం, దొంగ నోట్లు ఎక్కడకు వెళ్లాయని ప్రశ్నిస్తూ గతంలో ట్వీట్ చేశారు. నోట్ల రద్దు తర్వాత కూడా టెర్రర్ ఫండింగ్ కొనసాగిందని, ఉగ్రవాదుల దాడుల్లో అంతకుముందు కంటే ఎక్కువగానే భద్రతా సిబ్బంది మరణించారని పేర్కొన్నారు. నోట్ల రద్దు నిర్ణయం తనదిగా చెప్పుకొంటున్న ప్రధాని మోదీ.. దాని వినాశకర ఫలితానికి కూడా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దు కారణంగా 100 మందికి పైగా మరణించారని, కంపెనీల మూతతో ఉద్యోగాలు ఊడిపోయాయని, ప్రజల జీవితాలు అతలాకుతలం అయ్యాయని అన్నారు.