ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. లాతూర్ గ్రామీణ ప్రాంతంలో సీఎం ఏక్నాథ్ షిండే (Eknath Shinde) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల గురించి ఆయన మాట్లాడారు. అయితే పథకాల పేర్ల కోసం పక్కనే ఉన్న బీజేపీ నేత సహాయం తీసుకున్నారు. ‘మాతా సురక్షిత్ తర్ ఘర్ సురక్షిత్’ అనే నినాదంతో తన ప్రసంగాన్ని షిండే ప్రారంభించారు. అలాగే ప్రభుత్వ పథకాల పేర్ల కోసం ఆయన పక్కనే ఉన్న బీజేపీ నేతపై ఆధారపడ్డారు. ఆ బీజేపీ నేత చెప్పిన తర్వాత ‘మహాత్మా ఫూలే యోజన’, ‘జాగ్రుక్ పాలక్, సుధూర్ద్ బాలక్’, ‘ఆరోగ్య తరుణాయి, వైభవ్ మహారాష్ట్ర’ వంటి పథకాల పేర్లను అతి కష్టంగా సీఎం షిండే పలికారు. రాష్ట్ర పథకాలన్నీ గిన్నీస్ రికార్డుకెక్కాయని అన్నారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో సీఎం షిండేను నెటిజన్లు ట్రోల్ చేశారు. టెలీ ప్రాంప్టర్కు బదులుగా హ్యూమన్ ప్రాంప్టర్ను ఆయన వినియోగించారని కొందరు పేర్కొన్నారు. అలాగే బీజేపీ నేతను ప్రాంప్టర్గా వినియోగించుకోవడంపై మరికొందరు విమర్శించారు.
Eknath bhau is old-fashioned. He doesn’t use a teleprompter. He uses a human prompter. pic.twitter.com/qpW6Ka5Dbj
— PuNsTeR™ (@Pun_Starr) November 9, 2024