న్యూఢిల్లీ : కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి యెడియూరప్ప స్పందించారు. రాజీనామా ఊహాగానాలను యెడియూరప్ప ఖండించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కర్ణాటకలో పార్టీ అభివృద్ధిపై చర్చించామన్నారు. తన పట్ల జేపీ నడ్డాకు మంచి అభిప్రాయం ఉందన్నారు. కర్ణాటకలో బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని యెడియూరప్ప స్పష్టం చేశారు.
కర్ణాటకలో సాగునీటి ప్రాజెక్టుల విషయంపై చర్చించేందుకు మాత్రమే ఢిల్లీ వచ్చానని, ఆగస్టులో మరోసారి ఢిల్లీకి వస్తానని ఆయన పేర్కొన్నారు. మేకెదాటు ప్రాజెక్టుపై కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జేపీ నడ్డాతో చర్చించానని తెలిపారు. ఈ ప్రాజెక్టు అనుమతుల కోసం కేంద్ర జల వనరుల శాఖ మంత్రిని కూడా కలిసి చర్చించానని చెప్పారు. మేకెదాటు ప్రాజెక్టును సాధించి తీరుతామని యెడియూరప్ప స్పష్టం చేశారు.
"Not at all…," says Karnataka CM BS Yediyurappa on being asked if he has resigned
— ANI (@ANI) July 17, 2021
"Yesterday I met the PM, we discussed the development of the state and I will come back again in August…there is no value of such news," he added. pic.twitter.com/I7pe7Wvbi0