మహాబలిపురం : రానున్న తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగనున్నట్లు టీవీకే అధినేత, నటుడు విజయ్ సంకేతాలు ఇచ్చారు. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐఏడీఎంకేలకు పరిపాలించే అర్హత లేదన్నారు. పొత్తులు లేకుండానే ఎన్నికల్లో పోటీకి తన పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు.
మహాబలిపురంలో ఆదివారం జరిగిన సభలో టీవీకే కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఏఐఏడీఎంకే నేరుగా బీజేపీకి లొంగిపోయిందని, డీఎంకే పరోక్షంగా బీజేపీకి లొంగిపోయిందని ఆరోపించారు. తాను ఎటువంటి ఒత్తిళ్లకు లొంగబోనని చెప్పారు. ఒత్తిడికి లొంగిపోయేలా కనిపిస్తున్నదా నా ముఖం? అని అడిగారు.