Madras High Court | ఆలయాలు పిక్నిక్ స్పాట్ కాదు.. గుడుల్లోకి హిందూయేతరులను అనుమతించొద్దన్న మద్రాస్ హైకోర్టు
దేవాలయాల్లోకి హిందూయేతర వ్యక్తుల ప్రవేశంపై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అన్ని ఆలయాల్లో హిందూయేతర మతాలకు చెందిన వ్యక్తులను ఆలయ ప్రవేశాల వద్ద ఉండే ధ్వజ స్తంభం దాటి అనుమతించొద్దని, ఈ విషయాన్ని తెలుపుతూ ఆలయ ప్రాంగణంలో బోర్డులు ఏర్పాటు చేయాలని తమిళనాడు దేవాదాయ శాఖను మంగళవారం ఆదేశించింది.
- ధ్వజ స్తంభం దాటి రాకూడదని తెలుపుతూ బోర్డులు పెట్టాలి
- తమిళనాడు ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు ఆదేశం
Madras High Court | మదురై, జనవరి 31: దేవాలయాల్లోకి హిందూయేతర వ్యక్తుల ప్రవేశంపై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అన్ని ఆలయాల్లో హిందూయేతర మతాలకు చెందిన వ్యక్తులను ఆలయ ప్రవేశాల వద్ద ఉండే ధ్వజ స్తంభం దాటి అనుమతించొద్దని, ఈ విషయాన్ని తెలుపుతూ ఆలయ ప్రాంగణంలో బోర్డులు ఏర్పాటు చేయాలని తమిళనాడు దేవాదాయ శాఖను మంగళవారం ఆదేశించింది. ఆలయాలు ‘పిక్నిక్ స్పాట్’ కాదని వ్యాఖ్యానించిన న్యాయస్థానం.. హిందువులకు తమ మతాన్ని విశ్వసించే, ఆచరించే ప్రాథమిక హక్కు ఉన్నదని, అందుకు భంగం వాటిల్లకూడదని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ స్పష్టం చేసింది.
డీ సెంథిల్ కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ శ్రీమతి ఈ మేరకు తీర్పునిచ్చారు. అరుల్మిగు పళని దండాయుతపాణి స్వామి ఆలయం, దాని ఉప ఆలయాల్లో హిందువులను మాత్రమే ప్రవేశాన్ని అనుమతించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరుతూ సెంథిల్ ఈ పిటిషన్ వేశారు. ఆ మేరకు ఆలయాల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని కూడా ఆయన కోరారు.
అండర్‌టేకింగ్ తీసుకొని అనుమతించాలి
పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. హిందూ మతం పట్ల విశ్వాసం లేని వారిని ఆలయాల్లోకి అనుమతించొద్దని ఆదేశించింది. ఒకవేళ ఎవరైనా హిందూయేతర వ్యక్తి వస్తే అధికారులు తనకు సదరు దేవతామూర్తి పట్ల విశ్వాసం ఉన్నదని, హిందూ మత, ఆలయ పద్ధతులను పాటిస్తానని పేర్కొంటూ అండర్‌టేకింగ్ తీసుకోవాలని పేర్కొన్నది. దీనిపై అధికారులు కూడా రిజిస్టర్ నిర్వహించాలని సూచించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | నిప్పులు చెరుగుతున్న సఫారీలు.. పీకల్లోతు కష్టాల్లో వరల్డ్ నంబర్ 1..!
‘బీఈడీ కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తప్పనిసరి’
చెరువు అలుగు నీటిని మళ్లించొద్దు… పైప్‌లైన్ అనుమతిని రద్దు చేయాలి
Transfers | రాష్ట్రంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు
డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

