న్యూఢిల్లీ : కాలా చష్మా డ్యాన్స్ పెర్ఫామెన్స్‌తో రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన నార్వే డ్యాన్స్ బృందం మరో ఐకానిక్ సాంగ్‌కు క్రేజీ మూమెంట్స్‌తో ముందుకొచ్చింది. ఈసారి చయ్య చయ్యా సాంగ్‌కు ఈ డ్యాన్స్ టీం పెర్ఫామ్ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు.
ఈ వైరల్ వీడియోను క్విక్ స్టైల్ ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ క్లిప్‌లో ట్రైన్‌పై నార్వే డ్యాన్స్ టీం బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సాంగ్‌కు ఆడిపాడింది. వీరి కూల్ స్టెప్స్‌తో మ్యూజిక్కు పర్ఫెక్ట్ సింక్ అయ్యేలా డ్యాన్స్ చేయడంతో పాటు డ్రెస్ కోడ్‌తోనూ మెప్పించారు. మేం తిరిగివచ్చామని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 20 లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. అయితే వీరి పెర్ఫామెన్స్ యూజర్లకు అంతగా ఎక్కలేదు. మీరు ఈ సాంగ్‌ను రీక్రియేట్ చేయలేకపోయారని ఓ యూజర్ కామెంట్ చేయగా, ఇంకొంచెం మెరుగ్గా చేసి ఉండాల్సిందని మరో యూజర్ పెదవివిరిచారు. 1998లో విడుదలైన దిల్ సే మూవీలో చయ్య చయ్యా సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా ఈ పాటను సుఖ్వీందర్ సింగ్, సప్నా అవస్ధి ఆలపించారు.