NoiseFit Origin smartwatch : భారత్‌లో ప్రముఖ లైఫ్‌స్టైల్ బ్రాండ్ నాయిస్ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌వాచ్ నాయిస్ఫిట్ ఆరిజన్‌ను లాంఛ్ చేసింది. ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, స్టైలిష్ డిజైన్‌తో ఈ స్మార్ట్‌వాచ్‌ను యూజర్ల దైనందిన జీవితాన్ని సరళతరం చేసేలా డిజైన్ చేశారు. నాయిస్ఫిట్ ఆరిజిన్ పవర్ఫుల్ ఈఎన్ 1 ప్రాసెసర్‌తో ఆకట్టుకోనుంది. న్యూ నెబులా యూఐ, స్లీక్ కాంటార్ కట్ డిజైన్‌తో ఈ స్మార్ట్‌వాచ్ కస్టమర్ల ముందుకొచ్చింది.
పలు హెల్త్ మానిటరింగ్ ఫీచర్లతో ఇది కేవలం స్మార్ట్వాచ్గానే కాకుండా ఆరోగ్యాభిలాషులకూ పలు సేవలు అందిస్తుంది. హ్యాసిల్ ఫ్రీ, హై పెర్ఫామెన్స్ అనుభూతిని అందించేలా నాయిస్ఫిట్ ఆరిజిన్‌ను రూపొందించారు.
ఈఎన్ 1 ప్రాసెసర్‌తో లేటెస్ట్ స్మార్ట్‌వాచ్ 30 శాతం వేగవంతమైన రెస్పాన్స్ రేట్, మెరుగైన ప్రాసెసింగ్ పవర్‌ను కలిగిఉంటుంది. నాయిస్ఫిట్ ఆరిజిన్ 1.46 ఇంచ్ అపెక్స్ విజన్ అమోల్డ్ డిస్ప్లే, మల్లిపుల్ మోడ్స్‌తో ఆల్వేస్ ఆన్ డిస్ప్లేతో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. 100కుపైగా స్పోర్ట్స్ మోడ్స్, వాచ్ ఫేస్‌లకు సపోర్ట్ చేస్తుంది. హార్ట్ రేట్, స్లీప్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్, స్ట్రెస్ వంటి పలు హెల్త్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
నాయిస్ఫిట్ ఆరిజిన్ జెట్ బ్లాక్, సిల్వర్ గ్రే, మిడ్నైట్ బ్లాక్, మొసాయిక్ బ్లూ, క్లాసిక్ బ్లాక్, క్లాసిక్ బ్రౌన్ కలర్స్‌లో లభిస్తుంది. రూ. 6,499కు లభించే ఈ స్మార్ట్‌వాచ్ గోనాయిస్.కాం, క్రోమా స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. నాయిస్ఫిట్ ఆరిజిన్ స్మార్ట్‌వాచ్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో జూన్ 7 నుంచి లభిస్తుందని కంపెనీ పేర్కొంది.
Read More :
PM Modi: ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం