గ్రేటర్ నోయిడా(యూపీ), ఆగస్టు 23: నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్)లోని గ్రేటర్ నోయిడాకు చెందిన సిర్సా గ్రామంలో వరకట్నం కోసం ఓ 26 ఏళ్ల మహిళను ఆమె భర్త, అత్తమామలు సజీవ దహనం చేశారు. కేసులోఆమె భర్తను పోలీసులు అరెస్టు చేశారు.
మరణించిన మహిళ భర్త, అత్తమామలు, మరిదిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శరీరమంతా కాలిపోయిన గాయాలతో ఉన్న నిక్కీ అనే మహిళను నోయిడాలోని ఫోర్టీస్ దవాఖానకు తీసుకురాగా ఢిల్లీలోని సఫ్దర్జంగ్ దవాఖానకు తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. మార్గం మధ్యలో నిక్కీ చనిపోయింది.