న్యూఢిల్లీ: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడినా, అమ్మినా రూ.5 వేలు జరిమానా విధిస్తామంటూ నోయిడా అథారిటీ సోమవారం ప్రకటించింది. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, 2022లో భాగంగా మార్చి 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొస్తున్నామని నోయిడా అథారిటీ ప్రజా ఆరోగ్య విభాగం జనరల్ మేనేజర్ ఎస్పీ సింగ్ తెలిపారు.
120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ బ్యాగ్స్, బెలూన్ స్టిక్స్, ప్లాస్టిక్ జెండాలు, క్యాండీ స్టిక్స్, చెంచాలు, స్ట్రాలు, సిగరెట్టు, స్వీట్ డబ్బాలకు చుట్టేవి.. వీటన్నింటినీ నిషేధిస్తున్నట్టు చెప్పారు.