Supreme Court: భర్తపై ఆధారపడనని భార్య చెప్పొద్దు : సుప్రీంకోర్టు
Supreme Court: వ్యక్తిగతంగా, స్వేచ్ఛగా ఉంటూ.. ఎవరి మీద ఆధారపడవద్దు అనుకుంటే అప్పుడు పెళ్లి చేసుకోవద్దు అని సుప్రీంకోర్టు తెలిపింది. ఓ కేసులో వాదనలు విన్న ధర్మాసనం.. భర్తపై ఆధారపడడని భార్య చెప్పడం సరికాదు అని పేర్కొన్నది. జస్టిస్ బీవీ నాగరత్న, ఆర్ మహాదేవన్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.
న్యూఢిల్లీ: పెళ్లి అంటే ఒక్కటిగా కలిసి జీవించడం అని, ఒకరిమీద ఒకరు ఆధారపడకుండా.. వ్యక్తిగతంగా జీవించడం కాదు అని సుప్రీంకోర్టు(Supreme Court) పేర్కొన్నది. వేర్వేరుగా జీవిస్తున్న భార్యాభర్తల కేసులో ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పెళ్లి చేసుకున్న జంట.. భాగస్వామి మీద ఆధారపడకుండా, వ్యక్తిగతంగా ఉంటానని చెప్పడం సరికాదు అని కోర్టు తెలిపింది. ఒకవేళ ఎవరైనా వ్యక్తిగతంగా జీవించాలనుకుంటే, అప్పుడు వాళ్లు వైవాహిక బంధంలోకి వెళ్లకూడదని సుప్రీం ధర్మాసనం తెలిపింది.
జస్టిస్ బీవీ నాగరత్న, ఆర్ మహాదేవన్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. వివాహ బంధం కొనసాగుతున్న సమయంలోనే.. వ్యక్తిగతంగా జీవిస్తామని.. భార్య కానీ, భర్త కానీ చెప్పడం కుదరదు అని కోర్టు చెప్పింది. ఈ విషయంలో కోర్టు చాలా స్పష్టంగా ఉందని, పెళ్లి అంటే కలిసి జీవించడం అని ధర్మాసనం అభిప్రాయపడింది. పెళ్లి అంటే ఇద్దరు వ్యక్తులు, రెండు ఆత్మలు ఏకం కావడం అని, మీరెలా వ్యక్తిగతంగా ఉండగలరని కోర్టు ప్రశ్నించింది.
పెళ్లి చేసుకున్న జంట.. వ్యక్తిగతంగా జీవిస్తానని చెప్పడం అసాధ్యమని కోర్టు పేర్కొన్నది. ఒకవేళ ఆ జంట ఒక్కటైతే, మేం సంతోషంగా ఉంటామని, ఎందుకంటే వాళ్ల పిల్లలు ఇంకా చిన్నవయసులోనే ఉన్నారని కోర్టు చెప్పింది. గూడు చెదిరిన ఇంట్లో ఎలా ఆ పిల్లలు ఉంటారని, దీంట్లో వాళ్ల తప్పు ఏంటని కోర్టు ప్రశ్నించింది. ఇద్దరూ తమ మధ్య ఉన్న విబేధాలను పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. ప్రతి భార్యాభర్తల మధ్య ఏదో ఒక రకమైన వివాదం ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది.
హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ దాఖలు చేసిన పిటీషన్‌పై ఇవాళ సుప్రీంలో విచారణ జరిగింది. భర్త సింగపూర్‌లో ఉంటున్నాడు. ఆ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే సింగపూర్ వెళ్లేందుకు భార్య ఇష్టపపడం లేదు. సింగపూర్‌లో తన భర్త ప్రవర్తన సరిగా లేదని ఆమె కోర్టుకు చెప్పింది. ఆ సమయంలో కోర్టు ఆమెను కొన్ని ప్రశ్నలు వేసింది. పిల్లల పేరిట కొంత అమౌంట్ డిపాజిట్ చేయాలని భర్తకు కోర్టు సూచన చేయగా, అయితే తాను ఎవరిపై ఆధారపడడానికి ఇష్టంగా లేనట్లు భార్య చెప్పింది.
ఆ సమయంలో జస్టిస్ నాగరత్న స్పందిస్తూ మీరలా మాట్లాడకూడదని, ఒకసారి పెళ్లి అయితే, మీరు భావోద్వేగంగా, మరే రీతిలో అయినా భర్తపై ఆధారపడుతారని, ఆర్థికంగా కాకపోవచ్చు అని అన్నారు. నేను ఎవరి మీద ఆధారపడను అని చెప్పవద్దు అని, అలాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నారని జస్టిస్ నాగరత్న అడిగారు. నేను పాత కాలం మనిషినే కావొచ్చు, కానీ భర్తపై ఆధారపడను అని ఏ భార్య కూడా చెప్పవద్దు అని అన్నారు. మీరంతా చదువుకున్నవాళ్లు, సమస్యను మీరే పరిష్కరించుకోవాలని జస్టిస్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Case | అరెస్ట్ చేయకుండా లంచం డిమాండ్.. బంజారాహిల్స్ ఎస్ఐపై ఏసీబీ కేసు
‘టేకులపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ బుకింగ్స్ ప్రారంభం.. ఈ శుక్రవారం నుంచే థియేటర్లలో సందడి!
World Telugu Sahithi Conference | చైనాలో ఘనంగా 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి : ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

