భోపాల్: కరోనా నియంత్రణలో కీలకమైన వ్యాక్సినేషన్‌పై అన్ని రాష్ట్రాలు దృష్టిసారించాయి. ఈ నేపథ్యంలో టీకా తీసుకోని వారిపై పలు ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లా ఎక్సైజ్ అధికారి గురువారం కీలక ఉత్తర్వులు జారీ చేశారు. టీకా రెండు డోసులు తీసుకున్నవారికే మద్యం విక్రయించాలని లిక్కర్ షాపులను ఆదేశించారు. ఖాండ్వా జిల్లాలో 50 భారతీయ, 29 విదేశీ మద్యం షాపులు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ అధికారి ఆదేశాలు మందు బాబుల్లో గుబులు రేపుతున్నది. మరోవైపు మధ్యప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు తగ్గడంతో అన్ని నిబంధనలు, ఆంక్షలను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది.