ముంబై: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఏక్నాథ్ షిండే సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోకి ప్రవేశించే లైట్ మోటార్ వాహనాలకు టోల్ ఫీజును రద్దుచేస్తున్నట్టు ప్రకటించింది. సోమవారం అర్ధరాత్రి నుంచే ఇది అమల్లోకి వచ్చింది. కార్లు (హ్యాచ్బ్యాక్స్, సెడాన్లు, ఎస్యూవీలు), జీపులు, వ్యాన్లు, ఆటో రిక్షాలు, ట్యాక్సీలు, డెలివరీ వ్యాన్లు, చిన్నపాటి ట్రక్కులకు ఇది వర్తిస్తుంది.