Marital Rape | న్యూఢిల్లీ, డిసెంబర్ 11 : భార్యకు ఇష్టం లేని శృంగారాన్ని (మారిటల్ రేప్) నేరంగా పరిగణించే ప్రతిపాదన ఏదీ కేంద్రం వద్ద లేదని హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ‘18 ఏండ్ల కన్నా తక్కువ వయసున్న భార్యతో భర్త చేసే లైంగిక సంపర్కం, లైంగిక చర్యలు నేరంగా పరిగణించే ప్రతిపాదన ఏదీ కేంద్రం వద్ద లేదు’ అని ఆయన బుధవారం రాజ్యసభలో తెలిపారు. ఇప్పటికే వివాహ వ్యవస్థలో మహిళల హక్కులు, గౌరవాన్ని పరిరక్షించడానికి భారతీయ న్యాయ సంహితలోని 74,75,76, 85 సెక్షన్లతో పాటు గృహ హింస నుంచి కాపాడేందుకు మహిళల రక్షణ చట్టం, 2005 అమలులో ఉన్నాయని ఆయన తెలిపారు.