న్యూఢిల్లీ: దేశంలో రూ.500 బ్యాంక్ నోట్లను నిలిపివేసే ప్రతిపాదన ఏదీ లేదని, ఏటీఎంలలో 100, 200 రూపాయల నోట్లతో పాటు 500 నోట్లు కూడా యథావిధిగా అందుబాటులో ఉంటాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మంగళవారం పార్లమెంట్లో తెలిపారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు అందజేస్తున్న సహాయం మొత్తాన్ని పెంచే ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ పార్లమెంట్‌కు తెలిపారు.