లాక్డౌన్ ఉండదు.. స్పష్టం చేసిన ఆరోగ్యశాఖ మంత్రి
No Lock Down in Delhi | దేశ రాజధాని లాక్డౌన్ ఉండదని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ స్పష్టం చేశారు. పెరుగుతున్న కొవిడ్ కేసుల నేపథ్యంలో వారాంతపు కర్ఫ్యూ విధించామని, దాన్ని లాక్డౌన్గా భావించొద్దన్నారు. ఢిల్లీలో

న్యూఢిల్లీ : దేశ రాజధాని లాక్డౌన్ ఉండదని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ స్పష్టం చేశారు. పెరుగుతున్న కొవిడ్ కేసుల నేపథ్యంలో వారాంతపు కర్ఫ్యూ విధించామని, దాన్ని లాక్డౌన్గా భావించొద్దన్నారు. ఢిల్లీలో మంగళవారం 5,481 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 6.46శాతం నుంచి 8.5 శాతానికి పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. ఢిల్లీలో కొవిడ్ కేసుల పెరుగుదలను ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంటే కారణంగా పరిగణించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారన్నారు. సోమవారం ఢిల్లీలో 6.64 శాతం పాజిటివిటీ రేటుతో 4,099 కేసులు నమోదయ్యాయని, అలాగే ఒకరు మృతి చెందారు.
రెండు రోజుల్లో ఎక్కువ కార్యకలాపాలు జరుగనందున భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పెరుగుతున్న కరోనా ఆ రెండు రోజుల వ్యవధిలో ఎక్కువ కార్యకలాపాలు జరగనందున, భయాందోళన చెందాల్సిన అవసరం లేదని వారాంతపు కర్ఫ్యూ విధించినట్లు ఆరోగ్య మంత్రి తెలిపారు. ఇదిలా ఉండగా.. అంతకు ముందు రోజు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాట్లాడుతూ పెరుగుతున్న కొవిడ్ కేసుల మధ్య వారాంతపు కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. వారాంతపు కర్ఫ్యూ ప్రతి శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రారంభమై.. సోమవారం ఉదయం 5 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

