Dharmendra Pradhan: నీట్-యూజీ పరీక్ష పేపర్ లీకేజీపై ఆధారాలు లేవు: మంత్రి ధర్మేంద్ర ప్రదాన్
Dharmendra Pradhan: నీట్-యూజీ మెడికల్ ఎంట్రెన్స్ పరీక్ష పేపర్ లీకైనట్లు వస్తున్న ఆరోపణలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కొట్టిపారేశారు. పేపర్ లీకేజీకి సంబంధించిన ఆధారాలు లేవని ఆయన వెల్లడించారు.
న్యూఢిల్లీ: నీట్-యూజీ మెడికల్ ఎంట్రెన్స్ పరీక్ష పేపర్ లీకైనట్లు వస్తున్న ఆరోపణలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్(Dharmendra Pradhan) కొట్టిపారేశారు. పేపర్ లీకేజీకి సంబంధించిన ఆధారాలు లేవని ఆయన వెల్లడించారు. నీట్-యూజీ పేపర్ లీక్‌పై ఆధారాలు లేవని, ఎన్టీఏలో అవినీతి జరిగిందన్న ఆరోపణలు నిజం కాదు అని, అది చాలా నమ్మకమైన సంస్థ అని మంత్రి ప్రదాన్ తెలిపారు. ఈ కేసులో సుప్రీంకోర్టు వాదనలు వింటోందని, కోర్టు ఇచ్చే తీర్పుకు కట్టుబడి ఉంటామని ఆయన పేర్కొన్నారు. ఏ ఒక్క విద్యార్థికి కూడా నష్టం జరగకుండా చూస్తామన్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల కోసం నీట్-యూజీ రాసిన 1563 విద్యార్థులకు గ్రేస్ మార్క్‌లు ఇవ్వడాన్ని రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు ఇవాళ కేంద్రం వెల్లడించింది. అయితే ఆ విద్యార్థులు జూన్ 23వ తేదీన మరోసారి పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు కేంద్రం చెప్పింది. ఒకవేళ విద్యార్థులు పరీక్షను రాయడానికి విముఖంగా ఉంటే, అప్పుడు ముందు వచ్చిన మార్కులనే పరిగణలోకి తీసుకోనున్నట్లు కేంద్రం తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి బాలికల కబడ్డీ విజేత నల్లగొండ జట్టు
Health tips | రోజుకో బాయిల్డ్ ఎగ్ తింటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు.. అవేంటో తెలుసా..?
సాకివాగులో ఘనంగా జన జాతీయ గౌరవ దివస్ వేడుకలు
లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
Man Killed, Cop Injured In Firing | బంగారం లావాదేవీపై వివాదం.. కాల్పుల్లో ఒక వ్యక్తి మృతి, పోలీస్ అధికారికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

