హోలీ రోజు మధ్యాహ్నం 2.30 వరకు ఢిల్లీ మెట్రో రైళ్లు బంద్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ కరోనా విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. హోలీ వేడుకపైనా దీని ప్రభావం పడనున్నది. హోలీ రోజైన ఈ నెల 29న మధ్యాహ్నం 2.30 గంటల వరకు అన్ని మార్గాల్లో మెట్రో రైల్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) తెలిపింది. రాపిడ్ మెట్రోతోపాటు ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ లైన్లలో కూడా మెట్రో రైళ్లను ఆ సమయం వరకు నడపబోమని పేర్కొంది. ఈ మేరకు శనివారం ట్వీట్ చేసింది.
మరోవైపు మెట్రో రైళ్లలో కరోనా నిబంధనలు పాటించని ప్రయాణికులకు జరిమానాలు విధిస్తున్నారు. ఈ నెల 26 వరకు 758 మంది నుంచి ఢిల్లీ మెట్రో ఫ్లైయింగ్ స్క్వాడ్ సిబ్బంది జరిమానాలు వసూలు చేసినట్లు తెలిపింది. అందరం కరోనా నిబంధనలు పాటిద్దామని, ఇతరులకు మర్యాదపూర్వకంగా అవగాహన కల్పిద్దామని పేర్కొంది.
Holi Update
— Delhi Metro Rail Corporation (@OfficialDMRC) March 27, 2021
On Holi (29th March 2021), metro services will not be available till 2:30 PM on all lines of Delhi Metro, including Rapid Metro/Airport Express Line. pic.twitter.com/rMOJrZWWbj
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Delhi
- Delhi Metro Rail
- Holi
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

