Ragging | ర్యాగింగ్‌పై కఠిన చర్యలు చేపట్టండి.. మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ ఆదేశాలు..!
Ragging | గుజరాత్ జీఎంఈఆర్ఎస్ వైద్య కళాశాలలో ర్యాగింగ్ భూతానికి ఓ ఎంబీబీఎస్ విద్యార్థి మృతి చెందాడు. వసతి గృహం లో సీనియర్లు మూడు గంటలపాటు నిలబెట్టడంతో కోమాలోకి మృతి చెందినట్లుగా కేసు నమోదైంది. ఈ క్రమంలో నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) దేశంలోని మెడికల్ కాలేజీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Ragging | గుజరాత్ జీఎంఈఆర్ఎస్ వైద్య కళాశాలలో ర్యాగింగ్ భూతానికి ఓ ఎంబీబీఎస్ విద్యార్థి మృతి చెందాడు. వసతి గృహం లో సీనియర్లు మూడు గంటలపాటు నిలబెట్టడంతో కోమాలోకి మృతి చెందినట్లుగా కేసు నమోదైంది. ఈ క్రమంలో నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) దేశంలోని మెడికల్ కాలేజీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ర్యాగింగ్‌ను నిరోధించేందుకు ఎప్పటికప్పుడు నిబంధనలు అమలు చేస్తున్నామని.. అయితే, గ్రౌండ్ లెవెల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టకపోవడంతో ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయని కమిషన్ చైర్మన్ మెడికల్ కాలేజీలకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
గత కొంతకాలంగా పలు నివేదికల ద్వారా ర్యాగింగ్‌కు సంబంధించి ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొంది. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు వైద్య కళాశాలలు ర్యాగింగ్ ఫిర్యాదులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ చైర్మన్ ఆదేశించారు. గుజరాత్‌లోని ధర్పూర్ మెడికల్ కాలేజీలో జరిగిన ఘటన చాలా దారుణమని చైర్మన్ డాక్టర్ విజయ్ ఓజా పేర్కొన్నారు. ఇలాంటి ర్యాగింగ్ ఘటనలు విద్యాసంస్థల ప్రతిష్టను దిగజార్చుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. మానసిక వేధింపులు, ఆత్మహత్యలకు దారితీసే కేసులు ఉన్నాయని చైర్మన్ తెలిపారు. ఎన్ఎంసీ యాంటీ ర్యాగింగ్ సెల్, యూజీసీ యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్‌తో పాటు వివిధ మార్గాల ద్వారా ఈ విషయంలో ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు.
ఇటీవల గుజరాత్ ధర్పూర్లోని జీఎంఈఆర్ఎస్ వైద్య కళాశాలలో ర్యాగింగ్ 18 సంవత్సరాల వైద్య విద్యార్థి మృతి చెందాడు. వసతి గృహంలో సీనియర్లు మూడు గంటలపాటు నిలబెట్టడంతో మొదటి సంవత్సరం విద్యార్థి అనిల్ మెథానియా అచేతన స్థితిలోకి వెళ్లి మరణించాడని ఎఫ్ఐఆర్ నమోదైంది. వాళ్లు మమ్మల్ని మూడు గంటలపాటు నిలబడి పరిచయం చేసుకోవాలని, ఆందోళన చేయకూడదని ఒత్తిడిచేశారని.. చివరికి మాతోపాటు నిలబడిన ఓ విద్యార్థి పడిపోయాడని.. మేం అతడిని వెంటనే దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయాడని వైద్యులు ప్రకటించారని తోటి విద్యార్థులు పేర్కొన్నారు. ఈ క్రమంలో 15 మందిపై కేసు నమోదైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Gujarat
- NMC
- ragging
- Student death
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

