భూ బాధితులకు న్యాయం చేయాలి
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని సర్ సిల్ భూ బాధితులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం కాగజ్‌నగర్ మండలం కోసిని గ్రామంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ఎస్పీ మాట్లాడారు.
- పేదలకు ఇచ్చిన నోటీసులు ఉపసంహరించుకోవాలి
- ఈ విషయంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్పందించాలి
- లేదంటే సిర్పూర్ అగ్నిగుండంగా మారుతుంది
- బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్పీ హెచ్చరిక
కాగజ్‌నగర్, నవంబర్ 9 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని సర్ సిల్ భూ బాధితులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం కాగజ్‌నగర్ మండలం కోసిని గ్రామంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ఎస్పీ మాట్లాడారు. లగచర్లలో గిరిజనుల భూమి, వెలుగుమట్ల భూములను కబ్జా చేయాలని కాంగ్రెసోళ్లు చూశారని, హైదరాబాద్‌లో హైడ్రా పేరిట పేదల భూములు కబ్జా చేశారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి మాదిరిగానే ఎమ్మెల్సీ దండె విఠల్ కూడా పేదల ఇండ్ల ను తొలగించి, భూ కబ్జా చేయాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. దండె విఠల్‌కు బీజేపీ ఎమ్మెల్యే హరీశ్‌బాబు మద్దతిస్తున్నారని ఆరోపించారు. గతంలో సిర్పూర్ పేపర్ మిల్ కంపెనీకి హైదరాబాద్‌లో భూములిచ్చి, నౌగం బస్తీ వాసులను కాపాడిన విధంగానే సర్సిల్ భూములను కాపాడాలని కోరారు.
పోలీసుల సాయంతో బుల్డోజర్లు పట్టుకొచ్చి, అర్ధరాత్రి పేదల ఇండ్లు కూల్చాలని చూస్తే ప్రాణత్యాగానికైనా సిద్ధపడుతామని హెచ్చరించారు. పేదల ఇండ్లను వారంలో కూ ల్చాలని, నోటీసులు ఇవ్వాలని కోర్టు చెప్పలేదని, అయినా కాగజ్‌నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, ఎమ్మెల్సీ దండె విఠల్ ఎందుకు ఆపడం లేదని ధ్వజమెత్తారు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసుల్లో ఎకడా కోర్టు ఆదేశాలిచ్చినట్టుగా లేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎవరొచ్చినా ఆధారాలతో సహా సమాధానం చెప్తానని, ఎకడికి రావాలో చెప్పాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే, ఎమ్మె ల్సీ, అధికారులు పట్టించుకోకపోతే సిర్పూ ర్ నియోజకవర్గం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. అనంతరం బాధితులతో సబ్‌కలెక్టర్ ఆఫీస్‌కు వెళ్లి అధికారులకు వినతిపత్రం అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

