‘ధర్మన్’తో పోరుకు సిద్ధం
టాలీవుడ్లో ైస్టెలిష్ అండ్ ఎనర్జిటిక్ హీరోగా పేరు పొందిన రామ్ పోతినేని ‘ధర్మన్' చిత్రంతో తమిళ సినీరంగంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్లో ైస్టెలిష్ అండ్ ఎనర్జిటిక్ హీరోగా పేరు పొందిన రామ్ పోతినేని ‘ధర్మన్’ చిత్రంతో తమిళ సినీరంగంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. అగ్ర నటుడు కమల్‌హాసన్, ఆర్.మహేంద్రన్ నిర్మాతలు. నయనతార, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు.
ఈ సినిమాలో రామ్ ఎంట్రీని ప్రకటిస్తూ సోమవారం గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో గడ్డం, కళ్లద్దాలతో రామ్ ైస్టెలిష్ మాస్ అవతారంలో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపిస్తారని సమాచారం. రజనీకాంత్, రామ్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయని, ఈ కాంబినేషన్ ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్నందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

