థర్డ్ ఫ్రంట్ కాదు.. అది మెయిన్ ఫ్రంట్
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ‘మెయిన్ ఫ్రంట్' కోసం బీజేపీయేతర పార్టీలన్నీ కలిసిరావాలని బీహార్ సీఎం నితీశ్ కుమార్ పిలుపునిచ్చారు.
- బీజేపీయేతర పార్టీలన్నీ కలిసిరావాలి: నితీశ్‌కుమార్
- ప్రతిపక్ష నేతలు సానుకూలంగా స్పందించారని వెల్లడి
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ‘మెయిన్ ఫ్రంట్’ కోసం బీజేపీయేతర పార్టీలన్నీ కలిసిరావాలని బీహార్ సీఎం నితీశ్ కుమార్ పిలుపునిచ్చారు. బీజేపీయేతర పార్టీలు కలిస్తే థర్డ్ ఫ్రంట్ కాదని, అదే ‘మెయిన్ ఫ్రంట్’ అని పేర్కొన్నారు. అయితే దీనికి ఎవరు నాయకత్వం వహిస్తారనే విషయం తర్వాత నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నారు. గత మూడు రోజులుగా ఢిల్లీలో ఉండి, పలు ప్రతిపక్ష పార్టీల నేతలతో నితీశ్ సమావేశమయ్యారు. బుధవారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో సమావేశమయ్యారు.
ప్రతిపక్ష నేతలతో సమావేశం బాగా జరిగిందని, వారందరూ సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. అందరూ కలసి ప్రణాళికబద్ధమైన ఎజెండా రూపొందిస్తే 2024 ఎన్నికల్లో పరిస్థితులు వేరేలా ఉంటాయని చెప్పారు. ‘జాతీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్, లెఫ్ట్, ఇతర పార్టీలు కలిసి ముందుకు రావాలి. ఒకవేళ అన్ని రాష్ర్టాల్లోని బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపై వస్తే దేశంలో మంచి వాతావరణం ఏర్పడుతుంది’ అని పేర్కొన్నారు. ఇక బీజేపీకి దేశంలో ఆందోళనలు సృష్టించే పాలసీ మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

