Nitish kumar | బిహార్లో నైట్ కర్ఫ్యూ విధించే అంశాన్ని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తోసిపుచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కువగా కేసులు నమోదు కావడం లేదని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమ రాష్ట్ర పరిస్థితి మెరుగ్గానే ఉందని పేర్కొన్నారు. నైట్ కర్ఫ్యూ విధించేటంత పరిస్థితి రాష్ట్రంలో లేదని అన్నారు. మరోవైపు రాష్ట్ర పరిస్థితిని అంచనా వేయడానికి కేంద్ర బృందం రాష్ట్రానికి రానుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతుండటంతో ఆయా రాష్ట్రాలు ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధించాయి. మధ్యప్రదేశ్, హర్యానా, అస్సాం, యూపీ, ఒడిశా ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూ విధించాయి.