న్యూఢిల్లీ : బిహార్ సీఎం నితీష్ కుమార్ (Nitish Kumar) విపక్ష ఇండియా కూటమి కన్వీనర్‌గా నియమితులయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ దిశగా నిర్ణయం తీసుకునేందుకు విపక్ష నేతలు ఈ వారంలో వర్చువల్‌గా భేటీ కానున్నారని సమాచారం. ప్రతిపాదిత నియామకంపై కాంగ్రస్ ఇప్పటికే ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్‌లతో సంప్రదింపులు జరపడంతో పాటు ఇతర భాగస్వామ్య పక్షాలనూ విశ్వాసం లోకి తీసుకున్నట్టు తెలిసింది.
నితీష్ కుమార్ సైతం ఈ విషయమై శివసేన (యూబీటీ) చీఫ్‌తో మంగళవారం చర్చలు జరిపారు. ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సైతం ఈ ప్రతిపాదనకు అంగీకరించారని సమాచారం. డిసెంబర్ 19న ఇండియా కూటమి పార్టీల నేతలు ఢిల్లీలో నాలుగో విడత భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రధాని అభ్యర్ధిగా మల్లికార్జున్ ఖర్గే పేరును ప్రతిపాదించారు.
ఈ సమావేశంలోనే విపక్షాలు సీట్ల సర్ధుబాటు, ఉమ్మడి ప్రచారం, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహం సహా పలు అంశాలపై సంప్రదింపులు జరిపాయి. ఇక గత ఏడాది జులైలో బెంగళూర్‌లో జరిగిన సమావేశంలో విపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి.
Read More :
Dawood Ibrahim | వేలానికి దావూద్ ఇబ్రహీం చిన్ననాటి ఇల్లు..!