Jairam Ramesh | రంగులు మార్చడంలో ఊసరవెల్లులకే సవాల్.. నితీశ్‌కుమార్ సీజన్డ్ పొలిటీషియన్
Jairam Ramesh | ఇవాళ (ఆదివారం) ఉదయం బీహార్ సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్‌కుమార్‌పై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ తీవ్ర విమర్శలు చేశారు. నితీశ్ కుమార్ రాజీనామా తనను పెద్దగా ఆశ్చర్యానికి గురి చేయలేదని చెప్పారు. ఎందుకంటే ఆయన ఒక సీజన్డ్ పొలిటీషియన్ అని, సీజన్ల వారీగా ఆయన రంగులు మారుస్తుంటారని ఆరోపించారు.
Jairam Ramesh: ఇవాళ (ఆదివారం) ఉదయం బీహార్ సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్‌కుమార్‌పై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ తీవ్ర విమర్శలు చేశారు. నితీశ్ కుమార్ రాజీనామా తనను పెద్దగా ఆశ్చర్యానికి గురి చేయలేదని చెప్పారు. ఎందుకంటే ఆయన ఒక సీజన్డ్ పొలిటీషియన్ అని, సీజన్ల వారీగా ఆయన రంగులు మారుస్తుంటారని ఆరోపించారు.
నితీశ్ కుమార్ కొన్నాళ్లు ఆర్జేడీ, కాంగ్రెస్‌తో.. మరికొన్నాళ్లు బీజేపీతో అంటకాగుతూ సీఎం పదవి చేపడుతుండటంపై జైరామ్ రమేశ్ మండిపడ్డారు. ఆయన ఏళ్లుగా రంగులు మారుస్తూ వస్తున్నారని విమర్శించారు. రంగులు మార్చడంలో నితీశ్ ఊసరవెల్లులకే కఠిన సవాల్ విసురుతున్నారని ఎద్దేవా చేశారు. నితీశ్ కుమార్‌కు, ఢిల్లీ నుంచి ఆయనతో నాట్యం చేయిస్తున్నవాళ్లకు వచ్చే ఎన్నికల్లో బీహార్ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రను చూసి బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షా ఆందోళన చెందుతున్నారనడానికి బీహార్‌లో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలే నిదర్శనమని జైరామ్ రమేశ్ చెప్పారు. రాహుల్ యాత్ర నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే బీజేపీ ఈ డ్రామాలకు తెరలేపిందని ఆయన ఆరోపించారు. నమ్మక ద్రోహం చేయడంలో నితీశ్‌కుమార్ నిపుణుడని దుమ్మెత్తిపోశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Market | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 1,109 పాయింట్లు లాభం
అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రజల్లో అవగాహణ ఎంతో అవసరం
Jatayu | ‘రామాయణం’లో జటాయువుగా అనుపమ్ ఖేర్!
CPR | సీపీఆర్ అంటే ఏమిటి.. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ఇది ఎందుకు కీలకం..
రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలకు భీమవరం విద్యార్థినులు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

