పాట్నా, మార్చి 30: బీహార్ సీఎం నితీశ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఏదొక రోజు రాజ్యసభకు వెళ్లాలని అనుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదని, సీఎంగా తనకు అనేక బాధ్యతలు ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో బీజేపీతో నితీశ్ పార్టీ జేడీయూ పొత్తు సజావుగా సాగని విషయం తెలిసిందే. మరోవైపు సీఎంగా నితీశ్‌కుమార్‌ను తొలగించాలని బీజేపీ ఎమ్మెల్యే వినయ్ బిహారీ బుధవారం డిమాండ్ చేశారు.