పాట్నా, డిసెంబర్ 25: ప్రతిపక్ష ఇండియా కూటమిలో తనకు ఏ పదవీ వద్దని బీహార్ సీఎం నితీశ్‌కుమార్ చెప్పారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘వేర్వేరు పార్టీల నాయకులు నా గురించి మాట్లాడుతున్నారు. ఇండియా కూటమిలో నితీశ్‌కు కీలక పదవి ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నారు. కానీ నాకు ఏ పదవీ వద్దని మొదటి నుంచి చెప్తున్నాను. కాకపోతే నా విజ్ఞప్తి ఒక్కటే.. వీలైనంత త్వరగా సీట్ల సర్దుబాటును తేల్చాలి’ అని తెలిపారు.