హైదరాబాద్ : బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్(Nitish Kumar), ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్(Tejaswi Yadav) ఒకే ఫ్లైట్‌లో ఢిల్లీ బయలురి వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నది. పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament elections) ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ అయితే ఎన్డీయేకు (NDA) దక్కింది కానీ ప్రాంతీయ పార్టీలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. బీజేపీ 240 సీట్లకే ఆ పార్టీ పరిమితమైంది. ఎన్డీఏ కూటమిలోని టీడీపీ 16, జేడీయూ 12 సీట్లు సాధించింది. ఇతరులు 24 సీట్లలో గెలుపొందారు.
బీజేపీ అధికారం చేపట్టాలంటే టీడీపీ, ఆర్జేడీ మద్దతు కీలకంగా మారింది. ఇదే సమయంలో ఇండియా కూటమి కూడా ఎలాగైన అధికారాన్ని చేజిక్కుంచుకోవాలని ఇండియా కూటమి పావులు కదుతుపున్నది. ఇప్పటికే కూటమిలోని పలువురు నేతలు చంద్రబాబు, నితీష్‌తో మంతనాలు జరిపారు. ఇలాంటి సమయంలో సీఎం నితీష్ కుమార్, ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ ఒకే ఫ్లైట్‌లో ఢిల్లీ బయలుదేరారు. దీంతో ఏం జరగబోతోందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పార్టీని కాపాడుకునేందుకు నితీష్ కుమార్ ఏమైనా చేస్తారని ఇటీవల తేజస్వీ చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఢిల్లీ బయలుదేరిన బీహార్ నేతలు
బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ ఒకే ఫ్లైట్‌లో ఢిల్లీ బయలుదేరారు.. దీంతో ఏం జరగబోతోందని ఉత్కంఠ నెలకొంది. pic.twitter.com/boRTBMMK21
— Telugu Scribe (@TeluguScribe) June 5, 2024