న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బీహార్ నేత నితిన్ నబీన్ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా తదితర అగ్ర నేతల సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. మొత్తం 37 సెట్ల నామినేషన్లు అధ్యక్ష పదవి కోసం దాఖలయ్యాయని.. అవన్నీ నితిన్ నబీన్ తరపునే ఉండటంతో ఎన్నికల ఏకగ్రీవమైందని బీజేపీ కేంద్ర ఎన్నికల అథారిటీ ప్రకటించింది. బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కిశోర్ ప్రసాద్ కుమారుడే నితిన్ నబీన్. ఆయనకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది. బంకీపూర్ నియోజక వర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నబీన్ బీహార్ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.