న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ.. కేంద్ర మంత్రి గడ్కరీ ఇవాళ లోక్‌సభ(Parliament)లో నవ్వులు పూయించారు. ఆ తర్వాత గడ్కరీ ఇచ్చిన లైట్ విందును కాంగ్రెస్ ఎంపీ స్వీకరించారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా జరిగిన ఈ ఘటన గురించి వివరాలు ఇలా ఉన్నాయి.
జాతీయ రహదారుల గురించి లోక్‌సభ జీరో అవర్‌లో ప్రశ్న వేశారు. దానికి మంత్రి గడ్కరీ సమాధానం ఇచ్చారు. అయితే కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా సప్లమెంటరీ క్వశ్చన్ వేశారు. రహదారుల సమస్య గురించి చర్చించేందుకు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. జూన్ నుంచి ట్రై చేస్తున్నా అపాయింట్మెంట్ దొరకడం లేదని ప్రియాంకా అన్నారు. ఆ టైంలో మంత్రి గడ్కరీ స్పందించారు. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత తన ఆఫీసుకు రావొచ్చు అన్నారు. తమ ఆఫీసు డోర్లు తెరిచి ఉంటాయని, ఎప్పుడైనా వచ్చి కలవమన్నారు.
ఇక ఆ తర్వాత ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది. కేంద్ర మంత్రి గడ్కరీ ఆఫీసుకు ఎంపీ ప్రియాంకా గాంధీ వెళ్లారు. కేరళలోని తన నియోజకవర్గం సమస్యలు గురించి ఆమె తెలిపారు. అయితే కొన్ని రహదారి ప్రాజెక్టులు కేరళ సర్కారు ఆధీనంలో ఉన్నాయని, వాటిని తానేమీ చేయలేనన్నారు. మిగితా ప్రాజెక్టుల గురించి ఆరా తీస్తానన్నారు. ఇటీవలే మీ సోదరుడు రాహుల్ గాంధీ తన నియోజకవర్గం రాయ్‌బరేలీ రోడ్డు ప్రాజెక్టుల గురించి కలిశారని, ఆయన పని జరిగిందని, ఒకవేళ మీ పనిచేయకుంటే ఆయనకు ఫిర్యాదు చేస్తారేమో అని గడ్కరీ అనడంతో అక్కడ ఉన్నవాళ్లు నవ్వుకున్నారు.
గడ్కరీ ఆఫీసుకు ప్రియాంకా గాంధీ వెళ్లిన సమయంలో అక్కడ అతిథులకు లైట్ డిష్ ఏర్పాటు చేశారు. బియ్యం పిండితో చేసిన రైస్ బాల్స్ వంటకం, చట్నీ సర్వ్ చేశారు. ప్రియాంకాతో పాటు ఆమెతో వచ్చిన ఇతర కాంగ్రెస్ నేతలు ఆ రైస్ బాల్స్ డిష్‌ను సేవించారు. కేంద్ర మంత్రి గడ్కరీ స్వయంగా ఆ వంటకాన్ని తయారు చేశారు. వంటలంటే గడ్కరీకి చాలా ఇష్టం. యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ ఆయన రెగ్యులర్‌గా రకరకాల డిష్‌లను తయారు చేస్తుంటారు. అయితే ఇవాళ ప్రియాంకా గాంధీకి వడ్డించిన రైస్ బాల్స్, చట్నీ . స్వయంగా మంత్రి గడ్కరీ వండినట్లు తెలుస్తోంది.
Nitin Gadkari sat with Priyanka GANDHI Vadra and had breakfast with her.
She was there for resolution of Road construction in her constituency in Waynad.pic.twitter.com/dqkNomHAoV https://t.co/9Gp54bzncL— Prashant (@prashant10gaur) December 18, 2025