న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: ముంబై-గోవా రహదారి విస్తరణలో దాదాపు 15 ఏండ్ల జాప్యం జరుగడం సిగ్గుచేటని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. పనాజీ సమీపంలోని పోర్వోరిమ్ వద్ద ప్రత్యేకంగా ఆరు లేన్ల ఎలివేటెడ్ రోడ్ కారిడార్‌ను బుధవారం ప్రారంభించిన అనంతరం గడ్కరీ మాట్లాడుతూ ప్రయాణికులకు ప్రయాణం నిజంగా మరింత సౌకర్యవంతంగా మారిం దా లేదా అని స్వయంగా తనిఖీ చేయడానికి, అంచనా వేయడానికి అక్టోబర్‌లో తాను ముంబై నుంచి గోవాకు రోడ్డు మార్గంలో ప్రయాణిస్తానని చెప్పారు. ముంబై-గోవా హైవే(విస్తరణ) ప్రారంభోత్సవానికి నేను రానని గతంలోనే ప్రకటించాను. ఎందుకంటే ఆ పనులు ఇంతలా ఆలస్యం కావడం సిగ్గుచేటుగా ఉంది అని గడ్కరీ వ్యాఖ్యానించారు.