న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి చెందిన పబ్లిక్ పాలసీ సంస్థ ‘నీతి ఆయోగ్’ (NITI Aayog) విఫలమైన ఆలోచన’ అని బీహార్‌కు చెందిన ఆర్జేడీ నేత మనోజ్ ఝా విమర్శించారు. ఒక నిర్దిష్ట లక్ష్యం కోసం ఏర్పడిన ఈ సంస్థ ఖచ్చితంగా ఏమీ సాధించలేదని అన్నారు. శనివారం ఏఎన్ఐ వార్త సంస్థతో మనోజ్ ఝా మాట్లాడారు. ‘నీతి ఆయోగ్ అంటే ఏమిటి? ఇది ఒక నిర్దిష్ట వార్షిక విధానం కోసం ఏర్పడిన సంస్థ. దాని నుంచి ఏమి సాధించాం? ఖచ్చితంగా ఏమీ లేదు’ అని అన్నారు.
కాగా, ప్లానింగ్ కమిషన్‌తో సమస్య ఏమిటి? అని మనోజ్ ఝా ప్రశ్నించారు. నెహ్రూ కాలం నాటి ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పడిందని తెలిపారు. అయితే నెహ్రూ కాలం నాటి అనేక విధానాలను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నదని విమర్శించారు. ‘నీతి ఆయోగ్ ఒక వైఫల్యం. విఫలమైన ఆలోచన. బీజేపీకి 240 సీట్ల తీర్పు కూడా అదే సందేశాన్ని కలిగి ఉంది. సమిష్టిని పునరుద్ధరించాలి’ అని అన్నారు.
మరోవైపు బీజేపీపై కూడా మనోజ్ ఝా మండిపడ్డారు. ‘ఇండియా బ్లాక్ మధ్య సమన్వయం లోపించిందని బీజేపీ భావిస్తే, వారు పొరబడుతున్నారు. సమన్వయం కలిగి ఉండటం లేదా లేకపోవడం పూర్తిగా భిన్నమైన విషయం. కానీ మేమంతా ఏకతాటిపై ఉన్నాం’ అని అన్నారు.
#WATCH | Delhi: RJD MP Manoj Jha says, “If BJP is thinking that there is lack of coordination among the INDIA alliance, then they are mistaken. What is NITI Aayog? It is a body which was formed for a particular academic exercise, what is achieved from it? Absolutely… pic.twitter.com/2rgi4DJy0X
— ANI (@ANI) July 27, 2024