లక్నో: నిర్బల్ ఇండియన్ షోషిత్ హమారా ఆమ్ దళ్ (నిషాద్) పార్టీ.. ఉత్తరప్రదేశ్‌లో ఓ ట్రెండ్ సెట్ చేసింది. బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల కన్నా బెటర్‌గా నిషాద్ పార్టీ పర్ఫార్మ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ రాష్ట్రంలో నిషాద్ పార్టీ 5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీతో జతకట్టిన నిషాద్.. యూపీలో పోటీ చేస్తోంది. 2016లో ఆ పార్టీని స్థాపించారు. సంజా నిషాద్ ఆ పార్టీని స్థాపించారు.
నిషాద్ వర్గానికి చెందిన ప్రజలు ఆ పార్టీకి అండగా ఉన్నారు. నిషాద్ కమ్యూనిటీలో జాలర్లు, మత్స్యకారులు ఎక్కువగా ఉన్నారు. బిండ్, మల్లా, మంజీ లాంటి ఉప కులాలు కూడా ఈ పార్టీ వైపే మొగ్గుచూపుతున్నాయి. అయితే గంగా నది పరివాహాక ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే ఈ కులాల వారే నిషాద్కు పెద్ద అసెట్. గతంలో ఈ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన విజయ్ మిశ్రా వివాదంలో ఇరుక్కున్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి మరో పార్టీ నుంచి జ్ఞాన్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.