హైదరాబాద్, జూలై 27 (నమస్తేతెలంగాణ) : శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెల 30న సాయంత్రం 5:40 గంటలకు నిసార్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఈ శాటిలైట్‌ను నాసా-ఇస్రో సంయుక్తంగా రూపొందించాయి.
2,392 కిలోల బరువున్న ఈ శాటిలైట్‌ను జీఎస్ఎల్వీ ఎఫ్-16 రాకెట్ ద్వారా కక్ష్యలోకి పంపించనున్నారు. ఈ ఉపగ్రహ ప్రయోగం కోసం ఎస్డీఎస్ఎస్లో అన్ని ఏర్పాట్లు చేశారు.