Loksabha Elections 2024 : తూర్పు రాష్ట్రాల అభివృద్ధికి ఎన్డీయే నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆమె పట్నాలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మలిచే క్రమంలో బిహార్, పశ్చిమ బెంగాల్, ఒడిషా వంటి తూర్పు రాష్ట్రాలను దేశానికి వృద్ధి కేంద్రాలుగా మార్చాలని కేంద్రం యోచిస్తోందని చెప్పారు. 2005కు ముందు ఆటవిక పాలనతో బిహార్ వృద్ధి దారుణంగా దెబ్బతిన్నదని నిర్మలా సీతారామన్ అన్నారు.
1991లో బిహార్‌లో తలసరి ఆదాయం రూ. 21,282 కాగా, జంగిల్ రాజ్ హయాంలో అది 33 శాతం పతనమై రూ. 14,209కి పడిపోయిందని వివరించారు. 2019 నాటికి బిహార్ తలసరి ఆదాయం ఏటా 5 శాతం వృద్ధితో రూ. 37,000కు చేరిందని చెప్పారు. జంగిల్ రాజ్‌లో దుష్పరిపాలన లేకుండా పాలన సజావుగా ఉంటే బిహార్ తలసరి ఆదాయం 2019 నాటికి రూ. 95,330కి చేరిఉండేదని మంత్రి పేర్కొన్నారు.
Read More :