రాయ్పూర్: ఛత్తీస్గఢ్ 2000 సంవత్సరంలో ఏర్పాటైంది. 15 ఏండ్లపాటు రాష్ట్రంలో బీజేపీ అధికారం చేపట్టింది. అయితే తొమ్మిది సీట్లలో మాత్రం ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయింది. దీంతో ఈసారైనా ఈ సీట్లలో బోణీ కొట్టాలని కమలం పార్టీ ఆరాటపడుతున్నది.
నవంబర్ 7, 17 తేదీల్లో రెండు విడతల్లో ఛత్తీస్గఢ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో సీతాపూర్, పలితనాఖర్, మార్వహి, మోహ్లా-మన్పూర్, కుంట, ఖరిస, కోర్బా, కోట, జైజాపూర్ సీట్లలో బీజేపీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా గెలవలేదు.