న్యూఢిల్లీ: తన సోదరుడు తలాల్ అబ్దో మెహదీని 2017లో హత్యచేసిన భారతీయ నర్సు నిమిష ప్రియకు క్షమాభిక్ష ప్రసాదించాలని లేదా నష్టపరిహారం తీసుకోవాలని(బ్లడ్ మనీ) వస్తున్న ప్రతిపాదనలను తమ కుటుంబం అంగీకరించే ప్రసక్తి లేదని అబ్దెల్ ఫత్తా మెహదీ స్పష్టం చేశారు.
షరియా చట్టం ప్రకారం ప్రతీకార న్యాయం(కిసాస్) కావాలన్న తమ డిమాండును బీబీసీ అరబిక్కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పునరుద్ఘాటించారు. చేసిన నేరానికి నిమిషను ఉరితీయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.