Night Curfew in Delhi | దేశ రాజధాని ఢిల్లీ కూడా నైట్ కర్ఫ్యూ దిశగా అడుగులు వేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూను విధించాయి. తాజాగా ఆ రాష్ట్రాల జాబితాలో ఢిల్లీ కూడా చేరింది. డిసెంబర్ 27, సోమవారం నుంచి రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు రాత్రి కర్ఫ్యూ అమలులో ఉండనుంది.
ఢిల్లీలో తాజాగా 290 కొత్త కేసులు నమోదు అవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిన్నటి కేసులతో పోల్చితే ఈ రోజు నమోదు అయిన కేసులు 16 శాతం ఎక్కువ.
నైట్ కర్ఫ్యూతో పాటు.. ఉదయం 8 నుంచి రాత్రి 10 వరకు 50 శాతం కెపాసిటీతో మాత్రమే రెస్టారెంట్లను నడపాలని ప్రభుత్వం తెలిపింది. బార్లు మాత్రం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10 వరకు 50 శాతం కెపాసిటీతో నడిపించుకోవచ్చు. సినిమా హాల్స్, మల్టిప్లెక్స్‌లు, ఆడిటోరియమ్స్, స్పా, జిమ్స్, యోగా సెంటర్లు, ఎంటర్టైన్మెంట్ పార్కులు, స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్టేడియమ్స్, స్విమ్మింగ్ పూల్స్ మూత పడనున్నాయి.
#COVID19 | Delhi reports 290 positive cases, one death, and 120 recoveries in the last 24 hours. Active cases 1,103 pic.twitter.com/iDM9ryYmg3
— ANI (@ANI) December 26, 2021