Hafiz Saeed | హఫీజ్ సయీద్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్.. జారీ చేసిన ఎన్ఐఏ కోర్టు
Hafiz Saeed : అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఎన్ఐఏ కోర్టు శనివారం ఈ వారెంట్ జారీ చేసింది.
Hafiz Saeed : అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఎన్ఐఏ కోర్టు శనివారం ఈ వారెంట్ జారీ చేసింది. పాకిస్తాన్‌కు చెందిన హఫీజ్ సయీద్.. లష్కర్ ఎ తయిబా తీవ్రవాద సంస్థను స్తాపించాడు. ఇండియాలో అనేక పేలుళ్లకు కారకుడు. 2001లో పార్లమెంట్‌పై దాడి, ముంబై ఉగ్రదాడి, పుల్వామా దాడి సహా పలు ఉగ్రదాడులకు కీలక సూత్రధారి. అలాగే, ఇండియాలో ఉగ్రవాదులకు శిక్షణ, ఆయుధాల సరఫరా వంటి నేరాలకు పాల్పడ్డాడు.
అమెరికా.. హఫీజ్ సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇటీవల అతడిపై ఎన్ఐఏ కొత్తగా పలు అభియోగాలు నమోదు చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో మొహమ్మద్ నకీబ్ భట్ అనే ఉగ్రవాదిని ఎన్ఐఏ శ్రీనగర్‌లో అరెస్టు చేసింది. చైనా మేడ్ గ్రెనైడ్ సహా అనేక ఆయుధాల్ని అతడి నుంచి స్వాధీనం చేసుకుంది. ఈ సందర్భంగా అతడి విచారణ సందర్భంగా హఫీజ్ సయీద్ పాత్రపై కీలక వివరాలు వెల్లడయ్యాయి. పాకిస్తాన్ కేంద్రంగా హఫీజ్ ఇండియాలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాడు. ఇండియాలో లష్కర్ ఎ తొయిబా నెట్వర్క్ నడుపుతున్నాడు.
అరెస్టైన నకీబ్ భట్ సహా పలువురు ఉగ్రవాదుల్ని అతడే తయారు చేస్తున్నాడు. అతడు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నాడని, తప్పించుకు తిరుగుతున్నాడని పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఆధారాల్ని ఎన్ఐఏ.. కోర్టుకు సమర్పించింది. దీంతో హఫీజ్ సయీద్‌పై ఎన్ఐఏ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. హఫీజ్ సయీద్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం రెండు నెలల్లో ఇది రెండోసారి. ఇంతకుముందు కూడా ఇదే కోర్టు వారెంట్ జారీ చేసింది. గత జూలై 8న ఈ ఆదేశాలిచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Hafiz Saeed
- NIA
- Pakistan
- Terroriss
RELATED ARTICLES
తాజా వార్తలు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

