న్యూఢిల్లీ, జూలై 20 : టోల్ ప్లాజాలకు 20 కిలోమీటర్ల పరిధిలో ఉండే నివాసితుల కోసం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) సరికొత్తగా ‘లోకల్ పాస్’ అనే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. అర్హత కలిగినవాళ్లు ‘రాజమార్గయాత్ర’ యాప్‌లో లోకల్ పాస్‌లను కొనుగోలు చేయవచ్చునని, ఇది ఆయా టోల్ ప్లాజాల గుండా అపరిమిత ప్రయాణానికి అనుమతిస్తుందని ఎన్హెచ్ఏఐ తెలిపింది.
ఢిల్లీలోని అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్-2లోని ముండ్కా-బక్కర్వాలా టోల్ ప్లాజా వద్ద ఈ ఫీచర్‌ను తొలిసారిగా ప్రవేశపెట్టామని, రాబో యే నెలల్లో దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించింది.