న్యూఢిల్లీ: క్రికెట్ స్టేడియాలు ఎస్టీపీలు(మురుగు నీటి శుద్ధి ప్లాంట్లు) ఏర్పాటు చేయకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా భూగర్భ జలాలను వినియోగించడంతో నేషనల్ గ్రీన్ టిబ్యునల్ 12 స్టేడియాలకు ఒక్కోదానికి రూ.5వేల జరిమానాను విధించింది.
ఈ విషయాలపై సెంట్రల్ గ్రౌంట్ వాటర్ అథారిటీకి ఆయా స్టేడియాలు లేదా సంబంధిత క్రికెట్ సంఘాలు సమాధానం చెప్పలేకపోయినందున వాటికి ఈ జరిమానా విధించినట్టు తెలిపింది. ఎన్జీటీ చైర్మన్ ప్రకాశ్ శ్రీవాస్తవ, సభ్యుడు ఎ సింథల్వెల్లతో కూడిన ధర్మాసనం 12 స్టేడియాలకు వివరాలు పంపాలని నోటీసులు ఇవ్వగా, వాటి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. మొహలీ సహా మిగిలిన స్టేడియాలు నీటి వినియోగంలో నిబంధనలు పాటించడం లేదని వివరించింది.